HomeTelugu Big Stories'భీమ్లా నాయక్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. యూసఫ్‌గూడలో ట్రాఫిక్‌ ఆంక్షలు

‘భీమ్లా నాయక్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. యూసఫ్‌గూడలో ట్రాఫిక్‌ ఆంక్షలు

hyderabad traffic diversion

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘భీమ్లా నాయక్‌’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈ వెంట్‌ రేపు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ సందర్భంగా రేపు మధ్యాహ్నం 2గం నుంచి రాత్రి 11గం వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్ లో రేపు ప్రీ రిలీజ్ వేడుక జరుగుతోంది. అయితే మైత్రీవనం నుంచి యూసఫ్ గూడ వైపుకు వచ్చే వాహనాలకు అనుమతిని పోలీసులు నిరాకరించారు. అయితే అటువైపు గా వచ్చే వాహనాలను సవేరా ఫంక్షన్ హాల్-క్రిష్ణ కాంత్ పార్క్-కళ్యాణ్ నగర్-సత్యసాయి నిగమగమం-కృష్టానగర్ మీదుగా మళ్ళించనున్నట్లు పోలీసులు తెలిపారు.

అంతేకాకుండా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి యూసఫ్ గూడా వైపు వచ్చే వాహనాలు శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగమగమం వైపు మళ్ళించనున్నట్లు తెలిపారు. వీటితో పాటు సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్, యూసఫ్ గూడా మెట్రో స్టేషన్ , కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడయం, ప్రభుత్వ పాఠశాలలో పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే 21వ తేదీతో ఇచ్చిన పాసులకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. కేవలం 23వ తేదీ ఉన్న పాసులకు మాత్రమే అనుమతించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu