శ్రీనువైట్లతో చైతు!

ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలతో వరుస హిట్స్ ను దక్కించుకున్న నాగచైతన్య ఇప్పుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అయితే
ఇప్పటినుండే చైతు తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టాడు.

ఈ క్రమంలో శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఈ చిత్రాన్ని శివ ప్రసాద్ రెడ్డి నిర్మించబోతున్నట్లు టాక్. శ్రీనువైట్ల బ్రూస్ లీ సినిమా ఫ్లాప్ కారణంగా నిరాశ పడకుండా వరుణ్ తేజ్ తో ‘మిస్టర్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా తరువాత చైతుతో కూడా సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.