ప్రభాస్‌నే లవ్‌ చేస్తానంటున్న హీరోయిన్‌!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్.. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో ఒకరు. తన వయసు కలిగిన టాలీవుడ్ స్టార్స్ పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు. ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి దూరంగానే ఉండటం విశేషం. బాహుబలి తరువాత పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. బాహుబలి మొదలయ్యి.. విడుదల కూడా జరిగిపోయింది. మరి పెళ్ళెప్పుడు అంటే.. ఏదొక సమాధానం చెప్పి తప్పించుకుంటున్నాడు. ప్రభాస్.. అనుష్కకు ఉన్న పరిచయం దృష్ట్యా.. ఇద్దరు ప్రేమించుకుంటున్నారని.. అందుకే ఇద్దరు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని వార్తలు వచ్చాయి.

ప్రభాస్ ను ఇష్టపడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో తమిళ హీరోయిన్ కూడా ఉంది. తాను లవ్ అంటూ చేయాల్సి వస్తే.. ప్రభాస్ నే చేస్తానని.. లవ్ అని చెప్పాల్సి వస్తే ప్రభాస్ కు మాత్రమే చెప్తామని అంటోంది తమిళ హీరోయిన్. ఇంతకి ఆ తమిళ హీరోయిన్ ఎవరు అనే సందేహం వచ్చిందా.. అక్కడికే వస్తున్నా.. ఆమె ఎవరో కాదు… వరలక్ష్మి శరత్ కుమార్. కేవలం హీరోయిన్ పాత్రలు మాత్రమే చేస్తానని భీష్మించుకుని కూర్చోకుండా.. అవసరమైతే విలన్ పాత్రలు చేయడానికైనా రెడీ అంటూ ఫుల్ బిజీగా మారింది. సర్కార్ లో ఆమె పండించిన విలనిజం అంతాఇంతా కాదు. మరి వరలక్ష్మి ప్రపోజల్ విషయం ప్రభాస్ కు తెలిస్తే ఎలా స్పందిస్తాడో చూడాలి..