నాన్నగారితో కలిసి తప్పక నటిస్తా: నాగచైతన్య


అక్కినేని యంగ్‌ హీరో నాగచైతన్య ‘మజిలీ’తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నెల 13వ తేదీన ‘వెంకీమామ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ తో ఆయన తీరికలేకుండా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, “కథాకథనాలు .. పాత్రలను మలిచిన తీరుతో ‘వెంకీమామ’ ప్రతి ఒక్కరినీ మెప్పిస్తుంది. ఈ సినిమా వలన వెంకటేష్‌ గారి నుంచి చాలా విషయాలను నేర్చుకున్నాను. ఆడియన్స్ కి తప్పకుండా కనెక్ట్ అవుతుందనే నమ్మకం వుంది” అన్నాడు.

ఈ సమయంలోనే ‘బంగార్రాజు’ సినిమా గురించిన ప్రస్తావన రావడంతో ఆయన స్పందిస్తూ .. ‘బంగార్రాజు’ కథ పూర్తిస్థాయిలో నాన్నకు సంతృప్తిని ఇవ్వలేదు. అందువలన ఇంకా కసరత్తు జరుగుతూనే వుంది. కథ సంతృప్తికరంగా వచ్చాకే ప్రాజెక్టు ఓకే అవుతుంది. ఈ సినిమాలో నాన్నగారితో కలిసి నేను నటిస్తాను” అని చెప్పుకొచ్చాడు.

CLICK HERE!! For the aha Latest Updates