HomeTelugu Trendingజాన్వీ కోసం దొంగతనం చేశాను..

జాన్వీ కోసం దొంగతనం చేశాను..

8 8

నటి జాన్వీ కపూర్‌ కోసం ఒకసారి దొంగతనం చేశానని నటుడు ఇషాన్‌ ఖట్టర్ అన్నారు. జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా వెండితెరకు పరిచమైన ‘దఢక్‌’ చిత్రంలో ఇషాన్‌ ఖట్టర్‌ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు కూడా వస్తోన్నాయి. తాజాగా ఇషాన్‌ ఖట్టర్‌ నేహా ధూపియా రేడియో షోలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా సారా అలీఖాన్‌ కంటే జాన్వీకపూరే మంచి నటి అని ఇషాన్‌ తెలిపారు. ‘జాన్వీకపూర్‌ కోసం ఒమన్‌లో తలగడను దొంగతనం చేశాను. మొదట తను దొంగతనం చేయాలనుకున్నప్పటికీ తన వల్ల కాకపోవడంతో నేను చేయాల్సి వచ్చింది.’ అని తెలిపారు.

సారా, జాన్వీ వీరిద్దరిలో ఎవరితో నటించాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా.. ‘నేను జాన్వీతో నటించడానికి ఓకే చేస్తాను. సారా కంటే జాన్వీనే మంచి నటి. ఒకవేళ జాన్వీకి ఏదైనా గిఫ్ట్‌ ఇవ్వాల్సి వస్తే.. పొలరాయిడ్‌ కెమెరాను గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఇష్టపడతాను’ అని ఇషాన్‌ పేర్కొన్నారు. అనంతరం ప్రేమలో ఉన్నారా అని ప్రశ్నించగా..’నేను ఇంకా ఎవరి ప్రేమలోను పడలేదు. నేనింకా సింగిల్‌గానే ఉన్నాను. ఒకవేళ నాకు గర్ల్‌ఫ్రెండ్‌ ఉంటే నా స్నేహితుడు సిద్ధాంత్‌ చతుర్వేదికి చెప్పడానికి సిగ్గుపడను.’ అని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu