HomeTelugu Trendingకోహ్లీ బయోపిక్‌లో నటిస్తా: విజయ్‌ దేవరకొండ

కోహ్లీ బయోపిక్‌లో నటిస్తా: విజయ్‌ దేవరకొండ

i want to play virat kohli
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘లైగర్’ మూవీ పరాజయం పాలైనప్పటికీ… తన తదుపరి సినిమాల షూటింగుల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ‘జనగణమన’, దర్శకుడు శివ నిర్వాణ.. సమంతతో కలిసి ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు. తాజాగా విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే తాను విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తానని చెప్పాడు. ఇప్పటికే ధోనీ బయోపిక్ ను సుశాంత్ రాజ్‌పుత్ తో తీశారని, అందువల్ల కోహ్లీ బయోపిక్ ను చేయాలనుకుంటున్నానని… కోహ్లీ పాత్రను తాను తప్ప ఎవరూ చేయలేరని అన్నాడు. మరి, విజయ్ దేవరకొండ ఆకాంక్ష నెరవేరుతుందా? లేదా? అనేది వేచి చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu