HomeTelugu Trendingతగ్గేదే లే: రొమాంటిక్‌ సాంగ్‌ విడుదల

తగ్గేదే లే: రొమాంటిక్‌ సాంగ్‌ విడుదల

Idhe Idhe Le Lyrical Song f

నవీన్ చంద్ర హీరో నటిస్తున్న చిత్రం ‘తగ్గేదే లే’. భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి శ్రీనివాసరాజు దర్శకుడిగా వ్యవహరించాడు. గతంలో ఆయన నుంచి వచ్చిన ‘దండుపాళ్యం’ సిరీస్ కి మంచి స్పందనవచ్చింది. ఇప్పుడు అదే సిరీస్ లో ఆయన చేసిన సినిమానే ‘తగ్గేదే లే’.

దండుపాళ్యం బ్యాచ్ .. లవర్స్ ను టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందనేది ఈ సినిమా కథ. లవర్స్ గా నవీన్ చంద్ర .. అనన్య రాజ్ .. దివ్య పిళ్లై కనిపించనున్నారు. ఈ సినిమాకి చరణ్ అర్జున్ సంగీతాన్ని సమకూర్చాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును విడుదల చేశారు. ‘ఇదే ఇదేనే ఇదే ఇదేనే నేనెదురు చూసినది ఇదే ఇదేనే’ అంటూ ఈ పాట సాగుతోంది.

చరణ్ అర్జున్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను హరిచరణ్ – మనీషా ఆలపించారు. మకరంద్ దేశ్ పాండే .. పూజా గాంధీ .. నాగబాబు ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ఈ నెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu