ఇలియానా సెటైర్లు ఎవరిని ఉద్దేశించో..?

టాలీవుడ్ ను వదిలేసి బాలీవుడ్ కు చెక్కేసిన ఇలియానాకు అక్కడ అవకాశాలు కనుమరుగయ్యాయి. ఈ మధ్య తన కామెంట్స్ తోనే తరచూ వార్తల్లో నిలుస్తున్న ఈ భామ తాజాగా మరికొన్ని కామెంట్స్ చేసి బాలీవుడ్ లో ప్రకంపనాలు రేపుతోంది. కొందరి బాలీవుడ్ లో తారలను ఉద్దేశించి ఇలియానా ఏదేమైనా.. కొందరు చాన్సుల కోసం లొంగిపోతారు.. అంటూ కొన్ని కామెంట్స్ చేసింది.

ఈ కామెంట్ బహుశా ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ ను ఉద్దేశించి మాట్లాడిందని స్పష్టంగా తెలుస్తోంది. అవకాశాలు లేక ఫ్రస్ట్రేషన్ లో కావాలని ఇలియానా ఇలా మాట్లాడుతుందని కొందరు సూటిగానే చెణుకులు వేస్తున్నారు. ఏదేమైనా.. అమ్మడు ఇలా బొల్డ్ కామెంట్స్ చేయడం బాలీవుడ్ లో చర్చనీయాంశం అయింది. ఇప్పటికైనా.. ఇలియానా తన ప్రవర్తన మార్చుకుంటే మంచిదని పలువురు సూచిస్తున్నారు.