ఆ పెళ్ళికి వెళ్ళిన హీరోయిన్స్ కి నోటీసులు..?

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కూతురు బ్రాహ్మణి వివాహం హైదరాబాదుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడైన రాజీవ్ రెడ్డితో బెంగళూరులో వైభవంగా జరిగింది. సౌత్ ఇండియాకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియమణి ఇలా చాలా మంది తారలు తమ డాన్సులతో వేదికను కలర్ ఫుల్‌గా చేసేశారు.

వీరంతా సరదా కోసం డాన్స్ చేయలేదు.. అలా చేసినందుకు గట్టిగా రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నారు. ఒక్క రాత్రిలో ఎంత డబ్బు సంపాదించారో అంటూ.. సినిమా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. పాపం అంత డబ్బు తీసుకున్న వీళ్ళ సరదా ఎక్కువ రోజులు ఉండకుండానే పోతుందని సమాచారం. గాలి ఇంట పెళ్లి గురించి ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.

దేనికి ఎంత ఖర్చు పెట్టారు..? దానికి సరైన లెక్క ఉందా.. లేదా..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. తెలుస్తోంది. అంతేకాదు ఈ పెళ్ళికి వచ్చిన సినీ తారలందరికీ కూడా నోటీసులు పంపే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి దీనికి మన తారలు ఏమని సమాధానం చెబుతారో.. చూడాలి!