HomeTelugu Trendingబిగ్‌బాస్‌: రసవత్తరంగా నాల్గోవారం నామినేషన్స్‌

బిగ్‌బాస్‌: రసవత్తరంగా నాల్గోవారం నామినేషన్స్‌

Interesting promo from Bigg
తెలుగు బిగ్‌బాస్‌ నాల్గోవారం నామినేషన్స్‌ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా మారింది. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో అఖిల్‌, అభిజిత్‌ మధ్య మొనాల్‌ గురించి మాటల యుద్దం జరిగింది. వారిద్దరి మధ్య గొడవలో తన పేరును తీసుకురావడంపై మొనాల్‌ మండిపడింది. ఇది నేషనల్‌ టెలివిజన్‌ మీ మధ్య గొడవలో నన్ను ఎందుకు తీసుకు వస్తున్నారు అని ఓ రేంజ్‌లో సీరియస్‌ అయింది. తాజాగా విడుదలైన ప్రొమో చూస్తుంటే.. అఖిల్‌, అభిజిత్‌లు మొనాల్‌ను కూల్‌ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. మొనాల్‌కు సారీ చెప్తున్నారు. అఖిల్‌ అయితే మొనాల్‌ను కన్విన్స్‌ చేస్తూ.. ఓదారుస్తు.. హగ్‌ కూడా చేసుకున్నాడు. అయితే మొదటి నుంచి అఖిల్‌, అభిజిత్‌లకు మొనాల్‌ అంటే క్రష్ ఉంది కానీ.. మొనాల్‌ మాత్రం ఇద్దరితో ఫ్రెండ్లీగా ఉంటూ పరిస్థితులను బట్టి చాలా తెలివిగా సేఫ్‌ గేమ్‌ ఆడుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu