HomeTelugu Trending'నా సామిరంగ' భాస్కర్‌ ఇంట్రో గ్లింప్స్‌

‘నా సామిరంగ’ భాస్కర్‌ ఇంట్రో గ్లింప్స్‌

Intro Glimpse of Bhaskar fr
నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే నా సామిరంగ నుంచి ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్ వదిలారు.

తాజాగా రాజ్ తరుణ్ పాత్రను పరిచయం గ్లింప్స్‌ విడుదల చేశారు. ఇందులో రాజ్ తరుణ్ భాస్కర్‌గా కనిపించనున్నాడు. దీనికి సంబంధించిన భాస్కర్ ఇంట్రో గ్లింప్స్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో గ్లింప్స్‌లో భాస్కర్ (రాజ్ తరుణ్), కుమారి (రుక్సార్ ధిల్లన్)ల 1980 నాటి ప్రేమకథని చాలా అందంగా పరిచయం చేశారు.

ఈ సినిమా సంక్రాంతకి (జనవరి12)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాగార్జునకు జంటగా ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివేంద్ర దాశరధి సినిమాటోగ్రఫీ అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu