HomeTelugu Trending'సినిమాపురం' ప్రోమో

‘సినిమాపురం’ ప్రోమో

Introducing CinemAApuram

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా సరికొత్త ప్రోగ్రామ్‌లు, షోలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సామ్‌జామ్‌, నంబర్‌ 1 యారీ, నాన్‌స్టాపబుల్‌.. వంటి సెలబ్రిటీ షోలతో అలరిస్తోన్న ‘ఆహా’ ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించడానికి సిద్ధమైంది. ‘సినిమాపురం’ పేరుతో దీనికి సంబంధించిన ఓ సరికొత్త ప్రోమోను తాజాగా విడుదల చేసింది. సినిమాపురంలోని ప్రజలకు సినిమా అంటే ఎంతో ఇష్టమని అల్లు అర్జున్‌కు ఆయన మేనేజర్‌ చెబుతూ కనిపించారు. అనంతరం, ‘సినిమాపురం’ గ్రామం చెక్‌పోస్ట్‌ వద్ద గేట్‌ పడటంతో బన్నీ తన వాహనం నుంచి బయటకు వస్తూ కనిపించారు. మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu