HomeTelugu Big Stories'నా దిమాక్‌ ఏందిరా డబుల్‌ సిమ్‌ కార్డు లెక్కుందీ..' 'ఇస్మార్ట్‌ శంకర్' ట్రైలర్‌

‘నా దిమాక్‌ ఏందిరా డబుల్‌ సిమ్‌ కార్డు లెక్కుందీ..’ ‘ఇస్మార్ట్‌ శంకర్’ ట్రైలర్‌

9 2
ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ నటించిన ‘ఇస్మార్ట్‌ శంకర్’ ట్రైలర్‌ విడుదలైంది. ‘ఏ బొమ్మా.. నువ్వు ఊ.. అంటే గోల్కొండ రిపేర్‌ చేసి నీ చేతిలో పెడతా.. నిన్ను బేగంని చేసి ఖిలా మీద కూర్చోపెడతా’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. ‘నా దిమాక్‌ ఏందిరా డబుల్‌ సిమ్‌ కార్డు లెక్కుందీ..’ అంటూ రామ్‌ చెబుతున్న డైలాగ్, నభా నటేశ్‌ తెలంగాణ యాసలో రామ్‌ను బెదిరిస్తున్న సన్నివేశం నవ్వులు పూయిస్తోంది. రామ్‌ యాటిట్యూడ్‌ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచింది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ హీరోయిన్‌లుగా నటించారు. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. 18న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu