HomeTelugu Big Storiesరానా- మిహీకాల నిశ్చితార్థం కాదంట.. ట్వీట్ వైరల్

రానా- మిహీకాల నిశ్చితార్థం కాదంట.. ట్వీట్ వైరల్

9 18
టాలీవుడ్‌ హీరో రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. రానా కూడా ‘ఇట్స్ అఫీషియల్’ అంటూ తన ఇన్‌స్టాలో ఫొటోలను పోస్ట్ చేయడంతో ఇది మరింత వైరల్‌ అయింది. అయితే ఇది నిశ్చితార్థమా కాదనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై రానా తండ్రి, నిర్మాత సురేష్ బాబు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. అంతా అనుకుంటున్నట్లు ఇది నిశ్చితార్థం కాదని.. జస్ట్ రెండు కుటుంబాలు కూర్చుని మాట్లాడుకున్నాం.. అని చెప్పినట్లు తెలుస్తుంది. రోకా ఫంక్షన్ అని రానా దగ్గుబాటి కూడా సన్నిహితులకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇది నిశ్చితార్థం అనే రాసుకొచ్చేసారు.

అదే ప్రచారం కూడా జరిగిపోయింది. కానీ ఇంకా నిశ్చితార్థం జరపుకోలేదని.. కేవలం రోకా ఫంక్షన్‌ ఏర్పాటు చేసుకున్నట్లు రానా తెలిపాడు. ఇదే విషయాన్ని హీరో నానితో కూడా వాట్సాప్ ఛాట్‌లో కూడా ఇదే చెప్పాడు రానా. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో అబ్బాయి ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందా అని నాని అడగ్గా.. లేదు రోకా ఫంక్షన్‌ అని రానా బదులిచ్చాడు. వెంటనే నాని రోకా ఫంక్షన్‌ అంటే తనకు తెలియదన్నట్టు గూగుల్‌లో సెర్చ్‌ చెస్తా అని ఫన్నీ రిప్లై ఇచ్చాడు.

9a 2

రోకా వేడుక అంటే రెండు కుటుంబాలు కలిసి కూర్చుని నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్‌కు సంబంధించిన విషయాల గురించి చర్చించడం అని అర్థమట. ఇప్పుడు రానా మిహీక కుటుంబాలు చేసింది ఇదే. కాకపోతే ఇదే నిశ్చితార్థం అని ప్రచారం జరిగింది. మన దగ్గర కాదు కానీ ఉత్తరాదిన దీన్ని ఎక్కువగా పాటిస్తారు. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలను మిహీకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీనికి జీవితానికి ఇది ప్రారంభం అంటూ హార్ట్‌ సింబల్‌ జత చేసింది. దీనిపై వెంకటేష్ పెద్ద కూతురు అశ్రితా దగ్గుబాటి, సోనమ్‌ కపూర్‌ భర్త ఆనంద్‌ అహుజా స్పందించారు. మొత్తానికి జరిగింది రానా నిశ్చితార్థం కాదని స్పష్టత వస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu