HomeTelugu Big Storiesస్టేజ్ మీద రామ్‌ గోపాల్‌ వర్మ డ్యాన్స్ .. వైరల్‌

స్టేజ్ మీద రామ్‌ గోపాల్‌ వర్మ డ్యాన్స్ .. వైరల్‌

2 24
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా సినిమాలు తీస్తుంటాడు. అంతేకాదు వర్మ తనకు తోచితే సినిమా తీస్తాడు. తోచకపోయినా సినిమా తీయడం వర్మ నైజం. ఈ ఏడాది ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో సంచలనం సృష్టించిన వర్మ.. ఆ తర్వాత ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలతో కావాల్సినంత కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టలేకపోయింది అది వేరే విషయం అనుకోండి. ఇపుడు ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ మూవీతో పలకరించబోతున్నాడు. నూతన సంవత్సరం కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు వర్మ.

ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ దర్శకుడితో పాటు నిర్మాతగా కూడా సత్తా చూపాడు. అంతేకాదు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా..గాయకుడిగా, ప్రూవ్ చేసుకున్నాడు. త్వరలో నటుడిగా తన సత్తా చూపించడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా ఆర్జీవీలోని మరో యాంగిల్ పరిచయం చేశాడు. అది కూడా ఇంత వరకు ఎవరూ చూడనిది. ఆర్జీవి తొలిసారిగా ఒక స్టేజ్ మీద డ్యాన్స్ చేశాడు. అంతేకాదు నామ మాత్రంగా అలా నడుము ఊపి వెళ్లిపోయే తరహాలో కాదు. ఒక నిమిషం పైగా వర్మ డాన్స్ చేసి అందరినీ ఆశ్యర్యపరిచాడు. ఇదంతా .. తన శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వంలో వర్మ నిర్మించిన బ్యూటిఫుల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగింది. ఇందులో ఈ సినిమా హీరోయిన్‌ నైనా గంగూలీతో కలిసి వర్మ డ్యాన్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

RGV Dance Performance At Beautiful Movie Pre Release Event || Ram Gopal Varma Dance |Celebrity Media

RGV Dance Performance At Beautiful Movie Pre Release Event || Ram Gopal Varma Dance |Celebrity Media#RGVDancePerformance #BeautifulMoviePreReleaseEvent

Posted by Celebrity Media on Monday, 23 December 2019

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu