HomeTelugu Trendingధనుష్‌ 'జగమే తంత్రం' ట్రైలర్‌

ధనుష్‌ ‘జగమే తంత్రం’ ట్రైలర్‌

Jagame Thandhiram Telugu Tr
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘జగమే తంతిరమ్’. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమాలో ధనుష్ గ్యాంగ్ స్టార్‌ పాత్రలో నటించాడు. ఈ సినిమా తెలుగులో ‘జగమే తంత్రం’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూసిన మేకర్స్.. చివరకు కరోనా కారణంగా ఓటీటీలో విడుదల చేయడానికి రెడీ అయ్యారు.

ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘నెట్ ఫ్లిక్స్’ లో జూన్ 18న ఈ చిత్రాన్ని డిజిటల్ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ‘జగమే తంత్రం’ తెలుగు ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ధనుష్ ఈ సినిమా లో డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నాడు. ఎప్పటిలాగే తనదైన శైలిలో యాక్షన్ తో అదరగొట్టాడు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటించగా.. జేమ్స్ కాస్మో, కలై యారసన్, జోజు జార్జ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైలర్ చూస్తుంటే కొత్త కథాంశంతో వస్తున్నట్లు అర్థం అవుతోంది. వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ ‘జగమే తంత్రం’ చిత్రాన్ని నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu