జగన్ ఒక ఫెయిల్యూర్ సీఎం అంటున్న నోళ్ళు ఈ మధ్య
ఎక్కువ అవుతున్నాయి. వాస్తవానికి సీఎం అయిన మొదటి ఏడాది నుంచే జగన్ ఒక ఫెయిల్యూర్ సీఎం. పోలవరం నిర్వాసితులుగా ఉన్న నాలుగున్నర లక్షల మందికి దారి చూపలేని దీన, హీనస్థితిలో సీఎం జగన్ నిలిచినప్పుడే.. జగన్ ఒక ఫెయిల్యూర్ సీఎం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై జగన్ కేంద్రాన్ని ప్రశ్నించలేక, మోడీ కాళ్ళు పట్టుకునప్పుడే.. జగన్ ఒక ఫెయిల్యూర్ సీఎం. తన కుట్రలకు కోడెల శివప్రసాదరావు లాంటి నాయకుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రోజే.. జగన్ ఒక ఫెయిల్యూర్ సీఎం. రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలి వెళ్ళిపోయినప్పుడే.. జగన్ ఒక ఫెయిల్యూర్ సీఎం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాల్లో జగన్ ఫెయిల్యూర్లు ఎన్నో ఉన్నాయి.
కాబట్టి.. ఇప్పుడు ఏదో కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ అంటూ మొర పెట్టుకోవడం వృధా. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది, జగన్మోహన్ రెడ్డి అనే అతను ఫెయిలా ?, పాసా? అని కాదు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ప్రజలు బలి కాకుండా కాపాడటం. కందుకూరులో, గుంటూరులో జరిగిన సంఘటనలలో సామాన్య ప్రజలు బలై పోయినట్టు.. మళ్లీ అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం. ఇప్పటికే జగన్ ఆంధ్ర రాష్ట్రంలో సౌతాఫ్రికా చట్టం తెచ్చాడు. అవసరం అయితే, ప్రతిపక్షాలు తమ బలాన్ని ఇంకా పెంచుకుంటున్నాయి అని తెలిస్తే.. తాలిబాన్ చట్టం కూడా తెస్తాడు. కాబట్టి జగన్ చట్టాల నుంచి సామాన్య ప్రజలను, ప్రతిపక్షాల కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో ప్రణాళిక వేసుకోవడం. అలాగే చరిత్రలో నియంతల చరిత్ర స్వల్ప కాలమే అని జగన్ పాలన పై తటస్థ ప్రజల్లో చైతన్యం కల్పించడం.
ఈ క్రమంలో నాయకులకు ఎన్నో అవరోధాలు ఎదురుకావచ్చు. పోలీసులతో పాటు కంచెలు అడ్డుగా నిలవొచ్చు. అధికారం జగన్ ది కాబట్టి.. ఏమైనా జరగొచ్చు. ఎలాగూ కొత్తగా జీవో 1 తీసుకొచ్చారు. కాబట్టి ఏం చేసినా చట్టబద్ధమే. అందుకే, ముందుగా ఈ జీవో కు వ్యతిరేకంగా అన్ని సంఘాలు, పార్టీలు కలిసి పోరాటం చేయాలి. చివరగా ఇంటికి వెళ్లిపోయే నాయకుడిని చూసుకుని అధికారులు తమ సర్వీస్ రికార్డ్‌లు పాడు చేసుకోకుండా ఉంటే, వారికే మంచిది. ప్రజల పోరాటాన్ని ఆపడం ఎప్పటికైనా ముప్పే అని పోలీసులు, అధికారులు కూడా గుర్తించాలి.