Homeపొలిటికల్జగనూ. కోటంరెడ్డిది రాజకీయ హత్యే

జగనూ. కోటంరెడ్డిది రాజకీయ హత్యే

Jaganoo. Kotamreddy is a political murder

రాజకీయ ఆత్మహత్యలు! ఈ పదం వినడానికి బాగుంది. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి పార్టీని విడి, బయటకు వచ్చే వారని ఉద్దేశించి వైసీపీ మీడియా ప్రచారం చేస్తున్న పదం ఈ ‘రాజకీయ ఆత్మహత్యలు!’. అంటే జగన్ రెడ్డిని వదిలితే తమ రాజకీయాలకు సమాధి కట్టుకున్నట్టే అని వైసీపీ మీడియా ప్రస్తుతం తెగ దంచి కొడుతోంది. కానీ, రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి అనేది పాత సామెత. ప్రస్తుత రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉండవు, కేవలం హత్యలే ఉంటాయి అనేది నిజం. ఉదాహరణకు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యవహారమే తీసుకుందాం. ఏ రోజూ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జగన్‌ ఆలోచనలకు భిన్నంగా పని చేయలేదు. ఇదే కోటంరెడ్డి పదే పదే చెబుతున్నాడు కూడా.

నిజానికి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి జగన్ అంటే పిచ్చి. పైగా వైఎ్‌సతోనూ, రాజారెడ్డితోనూ కోటంరెడ్డికి అనుబంధం ఉంది. ఇంకా డిటైల్డ్ గా చెప్పాలంటే.. వైఎస్‌ చనిపోయాక జగన్‌ పార్టీ పెడతారో లేదో తెలియని రోజుల్లోనే.. జగన్ రెడ్డి వెంట నడిచిన వ్యక్తి కోటంరెడ్డి. ఈ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జగన్ కి సపోర్ట్ చేసిన తొలి రోజుల్లో అసలు జగన్‌ పరిస్థితి ఏమవుతుందో కూడా తెలియదు.. కానీ కోటంరెడ్డి జగన్ వెంటే ఉన్నాడు. ఐదేళ్లు ప్రతిపక్ష కాలంలో కూడా జగన్ రెడ్డితోనే ఉన్నాడు. కానీ, కోటంరెడ్డికి దక్కింది ఏమిటి ?, చివరకు రాజకీయ హత్యే కదా. జగన్ కి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన సేవకు మంత్రి పదవి రావాలి. అన్నిటికి కంటే ముఖ్యంగా కోటంరెడ్డి ని జగన్ నమ్మాలి. కానీ, నేడు పొమ్మనకుండా పొగబెట్టారు. ఆలా చేస్తే అలిగి వెళ్లిపోకుండా ఇంకా జగన్ రెడ్డినే ఎలా నమ్ముకుని ఉంటారు ?,

అలా వెళ్లిపోయేవాళ్లు అందరివి రాజకీయ ఆత్మహత్యలే అంటే ఎలా కుదురుతుంది ?, ముమ్మాటికీ వైసీపీ పార్టీలో కోటంరెడ్డిది రాజకీయ హత్యే. ఐతే, కోటంరెడ్డి ముందుగానే ఆ హత్య కాకుండా బయటపడ్డాడు. కానీ, శ్రీధర్‌రెడ్డి వైసీపీకి దూరంగా జరిగాడు కాబట్టి, ఇప్పుడు ఆయన్ను ఆ పార్టీ ద్రోహిగా చూస్తోంది. అయినా, జగన్‌ రెడ్డి కోటంరెడ్డిని దూరం పెట్టాకే కదా, ఆయన బయటకు వచ్చింది. మరి ద్రోహి ఎలా అవుతాడు ?, అంటే.. జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు నోరు ఎత్తినా అతను ద్రోహినే అన్నమాట ?, నిజానికి వైసీపీని వీడాలని కోటంరెడ్డి కి లేదు. పైగా అధికారం ఇంకా 15 నెలలు ఉంది.. ఆఖరి రోజుల్లో వెళ్లొచ్చు కూడా. అయినా కోటంరెడ్డి ఇప్పుడే బయటకు వచ్చాడు అంటే.. జగన్ రెడ్డి తీరు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

కానీ, ఇవన్నీ వైసీపీ మీడియా చెప్పదు. ఇప్పుడు కోటంరెడ్డి లాంటి వారి పై మాత్రం నెగిటివ్ ప్రచారానికి దిగింది. అలవిమాలిన ఆశలు పెంచుకుని, అవి నెరవేరలేదని తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కునే వాడే కోటంరెడ్డి అని, తన గోతిని తానే తవ్వుకునే వాడే కోటంరెడ్డి అని, నీడనిచ్చి పండ్లు ఇచ్చే చెట్టుపై రాళ్లు విసిరే ధూర్తనే కోటంరెడ్డి అని.. ఇలా కోటంరెడ్డి పై వైసీపీ మీడియా విమర్శలు చేస్తూ.. తప్పుడు కథనాలు రాస్తోంది. అసలు ఇవన్నీ ఇంకా ప్రజలు నమ్ముతారు అని జగన్ రెడ్డి నమ్ముతున్నాడా ?, నమ్మితే ఏమనాలి ?, అది కచ్చితంగా జగన్ అవివేకమో.

ఇప్పటికే, అనాలోచన నిర్ణయాలతో, తన అహంకారంతో తన పతనాన్ని తానే నిర్దేశించుకునే దిశగా జగన్ రెడ్డి అడుగులు బలంగా పడుతున్నాయి. ఈ మధ్యలో జగన్ రెడ్డికి వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే.. వారిని నమ్మకద్రోహులుగా, వెన్నుపోటు దారులుగా చిత్రీకరిస్తున్నారు. చివరగా ఒక్క మాట.. అంతా సజావుగా సాగిపోతున్న తరుణంలో తన రాజకీయ సమాదిని తానే తవ్వుకున్న వ్యక్తిగా జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu