HomeTelugu Trendingప్రభాస్‌కు విలన్‌గా జగపతిబాబు.!

ప్రభాస్‌కు విలన్‌గా జగపతిబాబు.!

5 22యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ‘సాహో’ చిత్రంతో మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఈ చిత్రం తరువాత రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభమైన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా, జిల్‌ ఫేం రాధకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే 20 రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే తిరిగి ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాకు ‘జాన్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు చిత్రయూనిట్‌.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. 1950ల కాలంలో ఇటలీలో జరిగే ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు జగపతిబాబు విలన్‌ పాత్రలో నటించనున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో జగపతి బాబు పాత్రలో చాలా విభిన్నంగా ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu