HomeTelugu Trendingబన్నీ 'పుష్ప'లో జగపతిబాబు!

బన్నీ ‘పుష్ప’లో జగపతిబాబు!

Jagapati babu in pushpa movడైరెక్టర్‌ సుకుమార్-స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బన్నీ – సుక్కు కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల బన్నీ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక సినిమాలో జగపతిబాబు నటించబోతున్నాడని తెలుస్తుంది. ఓ కీలక పాత్ర కోసం సుకుమార్ జగపతి బాబును సంప్రదించారని తెలుస్తుంది. ఆ పాత్ర ఏమిటన్నది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. కాగా ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. పుష్ప షూటింగును త్వరలో మహబూబ్ నగర్ అటవీ ప్రాంతంల్లో చితీకరించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu