HomeTelugu Big Storiesభోళా శంకర్‌: జామ్‌ జామ్‌ జజ్జనక సాంగ్‌ విడుదల

భోళా శంకర్‌: జామ్‌ జామ్‌ జజ్జనక సాంగ్‌ విడుదల

Jam Jam Jajjanaka Lyrical f
మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్‌’. మెహర్ రమేష్ దర్శకత్వం వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ప్యాచ్‌ వర్క్‌లలో బిజీగా ఉంది. ఈ సినిమాపై మెగా అభిమానులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు.ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్ మెగాఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. తమిళ సినిమా వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా మరో నెల రోజుల్లో విడుదల కాబోతుంది. తాజాగా మేకర్స్‌ ఈ సినిమా సెకండ్ సింగిల్‌ను రిలీజ్‌ చేశారు. జామ్‌ జామ్‌ జజ్జనక అంటూ సాగే ఆకట్టుకుంటుంది.

మహతి స్వరసాగర్‌ స్వర పరిచిన ఈ క్యాచీ ట్యూన్‌కు అనురాగ్ కులకర్ణి, మంగ్లీ వోకల్స్‌ అదిరిపోయాయి. అంతే క్యాచీగా కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించాడు. పాట చాలా కలర్‌ఫుల్‌గా, గ్రాండియర్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా పాట మధ్యలో నర్సపెల్లి అనే ప్రైవేట్‌ సాంగ్‌ బిట్‌ అదిరిపోయింది. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫి కూడా చాలా స్టైలిష్‌గా ఉంది.

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్‌ చిరంజీవికి చెల్లెలిగా కనిపించనుంది. తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఏకే ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై అనీల్‌ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సుశాంత్‌ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్‌ స్వరాలు సమకూర్చుతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu