HomeTelugu Trendingమెగాస్టార్‌ పుట్టినరోజు వేడుకకు జనసేనాని

మెగాస్టార్‌ పుట్టినరోజు వేడుకకు జనసేనాని

5 19రేపు ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు అంగరంగవైభవంగా జరగబోతున్నాయి. మెగా ఫ్యాన్స్ నిర్వహించే ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్ వస్తారని కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతున్నది. అయితే, నిన్నటి వరకు ఆ విషయం అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. కానీ, మెగాస్టార్ చిరంజీవి ఆల్ ఇండియా ఫాన్స్ అధ్యక్షుడు స్వామి నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కలిసి ఈ వేడుకలకు ఆహ్వానించారు. పవన్ కూడా వస్తానని చెప్పడంతో ఈసారి జరిగే వేడుకలను మరింత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.

పవన్ కళ్యాణ్ వస్తుండటంతో శిల్పకళా వేదిక దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఫ్యాన్స్ కోసం పాసుల డిస్ట్రిబ్యూషన్ పూర్తయింది. ఆగష్టు 22వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu