HomeTelugu Trendingఎన్టీఆర్‌తో జాన్వీ కపూర్‌ రొమాన్స్‌!

ఎన్టీఆర్‌తో జాన్వీ కపూర్‌ రొమాన్స్‌!

1 28
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను డైరెక్టర్‌ త్రివిక్రమ్‌తో కలిసి చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పైనే త్రివిక్రమ్ కసరత్తు చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ ను తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.

టాలీవుడ్‌లో ఎంట్రీ కోసం జాన్వీ కపూర్ కూడా కొంత కాలంగా ఆసక్తి చూపుతోంది. అందువలన ఈ చిత్రంతో ఆమెను తెలుగు తెరకి పరిచయం చేయాలనే ఉద్దేశంతో త్రివిక్రమ్ వున్నాడని అంటున్నారు. ఒకవేళ జాన్వీ కపూర్ డేట్స్ సర్దుబాటు చేయలేకపోతే, పూజ హెగ్డేను తీసుకుందామనే నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘అరవింద సమేత’ భారీ హిట్‌ అందుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu