HomeTelugu Trending'జపాన్‌' సెన్సార్‌ పూర్తి

‘జపాన్‌’ సెన్సార్‌ పూర్తి

japan movie cencor complete 1
కోలీవుడ్ హీరో కార్తీ దర్శకుడు రాజు మురుగన్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం ‘జపాన్’. కార్తీ ఒక సరికొత్త మేకోవర్ అండ్ బాడీ లాంగ్వేజ్ లో చేసిన ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొంది. ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా హిట్ అయ్యింది. దీనితో మళ్ళీ కార్తీ మంచి హిట్ అందుకునేలా ఉన్నాడని అంతా అనుకుంటున్నారు.

ఇక ఈ చిత్రం ఇపుడు సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రం యూ/ఏ సర్టిఫికెట్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగు, తమిళ్ లో ఈ నవంబర్ 10న గ్రాండ్ గా దీపావళి కానుకగా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu