HomeTelugu Newsనాని బర్త్‌డే సందర్భంగా 'జెర్సీ' కొత్త పోస్టర్స్‌

నాని బర్త్‌డే సందర్భంగా ‘జెర్సీ’ కొత్త పోస్టర్స్‌

2 23యంగ్‌ హీరో నాని ఈరోజు తన 35వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘జెర్సీ’ సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్లను చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా విడుదల చేసింది. ఇందులో ఆయన అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రలో నటిస్తున్నారు. గౌతమ్‌ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధ శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 1990ల కాలం నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో చిత్రంలోనూ నాని నటిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ రోజు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని సాయంత్రం 5 గంటలకు టైటిల్‌ను ప్రకటిస్తామని చిత్రబృందం వెల్లడించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu