HomeTelugu Trending'జోరుగా హుషారుగా' ట్రైలర్‌

‘జోరుగా హుషారుగా’ ట్రైలర్‌

Jorugaa Husharugaa Trailer

బేబి ఫేం విరాజ్ అశ్విన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జోరుగా హుషారుగా’. ఈ సినిమాకు అను ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. పూజిత పొన్నాడ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శిఖ‌ర అండ్ అక్ష‌ర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ ప‌తాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ అండ్ ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోంది.

ఈ చిత్రాన్ని డిసెంబ‌రు 15న విడుద‌ల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌తో ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఉప్పెన ఫేం దర్శకుడు బుచ్చిబాబు సనా విడుదల చేసి.. చిత్రబృంద‌నిక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక ఈ ట్రైలర్ చూస్తే ఆద్యంతం ఫ‌న్ రైడ్‌లా కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్‌తో ఆకట్టుకుంటుంది. బ్రహ్మజీ కామెడీ డైలాగ్స్ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో సాయికుమార్‌, రోహిణి, మ‌ధునంద‌న్‌, సిరి హ‌నుమంతు, సోనూ ఠాకూర్‌, బ్రహ్మ‌జీ , చ‌మ్మ‌క్ చంద్ర‌, క్రేజీ క‌న్నా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్రణీత్ సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu