HomeTelugu Newsరమా రాజమౌళికి ముద్దుపెట్టిన కాజల్‌ ఫొటో.. వైరల్‌

రమా రాజమౌళికి ముద్దుపెట్టిన కాజల్‌ ఫొటో.. వైరల్‌

12 8
నటి కాజల్ ఏమిటి.. రాజమౌళి భార్యకు ముద్దు పెట్టడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..? అవునండీ.. తాజాగా ఈ చిత్రాన్ని స్వయంగా కాజలే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో కూడా బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం కాజల్ వరస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె తన సినిమాలతో పాటు బయట ఈవెంట్స్‌తో కూడా బాగానే బిజీగా ఉంది ఈ మధ్య. ఇప్పుడు కూడా ఓ సిటీకి వెళ్తుంటే ఫ్లైట్‌లో అనుకోని అతిథి పక్కనే కూర్చుంది. ఆమె మరెవరో కాదు రాజమౌళి భార్య రమా రాజమౌళి.

ఈమెను చూసిన కాజల్ ఒక్కసారిగా ఎగిరి గంతేసినంత పని చేసింది. వెంటనే పక్కకి వెళ్లి కూర్చుని ఆమెను గట్టిగా కౌగిలించుకోవడమే కాకుండా ముద్దు కూడా పెట్టేసింది. తనను రియల్ లైఫ్‌లో బాగా ఇన్‌స్పైర్ చేసిన కారెక్టర్స్‌లో రమా మేడమ్ కూడా ఒకరు అంటూ ఆమెను హత్తుకుంది కాజల్. అలాంటి గ్రేట్ పర్సన్ తను వచ్చే విమానంలోనే పక్కనే ఉండటాన్ని చూసి ఆనందాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది కాజల్. అందుకే వెంటనే ఆ సంతోషాన్ని ముద్దుల రూపంలో చూపించేసింది. ప్రస్తుతం కాజల్‌ భారతీయుడు 2తో పాటు మరికొన్ని సినిమాలకు కూడా కమిటైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu