HomeTelugu Trendingకాజల్‌ మెహందీ ఫంక్షన్‌ ఫోటో వైరల్

కాజల్‌ మెహందీ ఫంక్షన్‌ ఫోటో వైరల్

Kajal Mehndi Function Photo
టాలీవుడ్‌ అందాల చందమామ కాజల్ పెళ్లి సందడి మొదలైంది. మరో 24 గంటల్లో (అక్టోబర్ 30)న తన ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడనుంది. కాజల్‌ ఇంట ఇప్పటికే పెళ్లి వేడుకలతో ప్రారంభమైపోయాయి. తాజాగా కాజల్ సోదరి నిషా అగర్వాల్ వివాహానికి పూర్వపు వేడుకలు.. అలాగే హల్ది మెహందీ వేడుకలకు సంబంధించిన ఫోటోల్ని షేర్ చేసింది. కరోనా ఎఫెక్ట్‌తో కాజల్ – గౌతమ్ జంట పరిమిత అతిథులతో సింపుల్ గా వీరి వివాహం జరగనుంది. ఇంత సింపుల్ గా సరిపెట్టేస్తున్నందుకు కాజల్ కుటుంబం కాస్త నిరుత్సాహంగానే ఉన్నారట. ఆంక్షలు ఉన్నప్పటికీ షాదీకా మహౌల్ ను రూపొందించడానికి మావంతు ప్రయత్నం చేస్తున్నాము. మేము సాంప్రదాయ హల్ది, మెహందీ వేడుకలను ఇంట్లో నిర్వహించాము. రెండు వేడుకలు ఒకే రోజున జరిగాయి అని నిషా అగర్వాల్ తెలిపారు. పెళ్లి రోజున పాటల కార్యక్రమం .. డ్యాన్సులాడటం… ఉంటుందని నిషా తెలిపింది. సింపుల్ వెడ్డింగ్ అయినప్పటికీ పెళ్లి అంటేనే ప్రత్యేకమైనది. పెళ్లి రోజునే చక్కని హాయి గొలిపే సంగీతాన్ని ప్లాన్ చేశాం అని నిషా వెల్లడించింది. నిషా తన బావ గౌతమ్‌ని తెగ ఆటపట్టించేస్తోందట. అక్క కాజల్ తో పాటు నిషా అగర్వాల్ ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోల్ని షేర్ చేసింది. ఇందులో కాజల్ తన మెహందీ వేడుక ఫొటోలను షేర్‌ చేసింది.

 

View this post on Instagram

 

🧿 #kajgautkitched 🧿

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

 

View this post on Instagram

 

❤️

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu