HomeTelugu Big Storiesఆనందంలో కాజల్‌.. డేట్‌ ఫిక్స్‌

ఆనందంలో కాజల్‌.. డేట్‌ ఫిక్స్‌

3 1
టాలీవుడ్‌ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ ఎంట్రీ ఇచ్చి దాదాపు 12 ఏళ్ళు పూర్తయింది. ఇప్పటికి కూడా ఇంకా అవకాశాలు దక్కించుకుంటూ యంగ్‌ హీరోయిన్లకు పోటీగా నిలుస్తుంది. కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న కాజల్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న ఈ చందమామ అభిమానులకు మరో శుభవార్త చెప్పింది.

ఇటీవలే సింగపూర్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఆమె విగ్రహం ఏర్పాటు చేయడమే. కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఆ కార్యక్రమం దగ్గరకు వచ్చింది. ఈనెల 5వ తేదీన ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు మ్యూజియం అధికారులు. దీనికి ఇంకా కేవలం కొద్దిరోజుల మాత్రమే మిగిలివుంది. దీంతో కాజల్ ఆనందాన్ని తెలియజేసింది. గతంలో టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేష్ బాబుకు సంబంధించిన మైనపు విగ్రహాలను అక్కడ పెట్టిన సంగతి తెలిసిందే.

3a

Recent Articles English

Gallery

Recent Articles Telugu