ఆ పార్టీపై ఎన్టీఆర్ కామెంట్!

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల ఎంట్రీపై ఇండస్ట్రీలో మరోసారి చర్చలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ ‘నవ భారత్ నేషనల్ పార్టీ’ పేరుతో ఓ రాజకీయ పార్టీ పెట్టారనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఆ పార్టీ పేరును రిజిస్టర్ చేయించిన కొందరు వ్యక్తులు జూనియర్ ఎన్టీఆర్ ను అధ్యక్షుడిగా నియమిస్తున్నమంటూ ఓ లేఖను విడుదల చేశారు. అది పెద్ద చర్చకు దారితీసింది. ఈ వార్తలు ఎన్టీఆర్ చెవిన పడడంతో ఆయన దీనిపై స్పందించారు.
 
ప్రజలకు మంచి చేయాలంటే దానికి మార్గం రాజకీయాలు మాత్రమే కాదని.. తను పార్టీ పెడుతున్నట్లు వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.  ఇలాంటి గాలి వార్తలను అభిమానులు పట్టించుకోవద్దని సూచించారు. అలానే ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాల మీదనే ఉందని.. భవిష్యత్తులో ఆలోచన మారితే ముందుగా అభిమానులతో చర్చించి వారి సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు.