HomeTelugu Newsకమల్‌ జోడిగా కాజల్‌!

కమల్‌ జోడిగా కాజల్‌!

ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ‘భారతీయుడు’. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. మరోసారి కమల్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ‘భారతీయుడు-2’ పై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది.

1 29

త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో కమల్‌కు జోడిగా కాజల్‌ అగర్వాల్ నటించనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో చిరంజీవి లాంటి సీనియర్ల సరసన నటించిన కాజల్‌, కమల్‌ సరసన నటించే అవకాశం రావటంతో వెంటనే ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu