HomeTelugu Trendingఆచార్య నుండి కాజల్‌ తప్పుకోవడంపై క్లారిటీ..

ఆచార్య నుండి కాజల్‌ తప్పుకోవడంపై క్లారిటీ..

9 2
టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. కాగా ఈ సినిమాపై గత కొంత కాలంగా ఓ కొత్త వార్త ప్రచారంలో ఉంది. ఈ సినిమా నుంచి త్రిష తప్పుకున్న తర్వాత కాజల్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె కూడా ప్రాజెక్టు నుంచి వైదొలిగారని గత రెండు రోజులుగా వార్తలు పుట్టుకొస్తున్నాయి. తమిళ సినిమాకు ఎక్కువ డేట్స్‌ కావాల్సి రావడంతో కాజల్‌ ‘ఆచార్య’ను వదులుకున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రచారంపై కాజల్‌ ప్రతినిధులు స్పష్టత ఇచ్చారు.

ఆమె సినిమా నుంచి తప్పుకోలేదని పేర్కొన్నారు. ‘కాజల్‌ సినిమాకు ఎప్పుడో సంతకం చేశారు. అంతేకాదు చిరు సినిమాకు అడ్వాన్స్‌ కూడా తీసుకున్నారు. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత షూటింగ్‌ను పునః ప్రారంభిస్తే.. ఆమె నేరుగా సెట్‌కు వెళ్తారు’ అని తేల్చి చెప్పారు. ‘ఆచార్య’కు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. చిరు 152వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu