HomeTelugu Big StoriesKalki 2898 AD: ఆ రికార్డుని జస్ట్ మిస్ అయిన ప్రభాస్ సినిమా!

Kalki 2898 AD: ఆ రికార్డుని జస్ట్ మిస్ అయిన ప్రభాస్ సినిమా!

Kalki 2898AD trailer misses fastest 1M likes record

Kalki 2898 AD Trailer Record: ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898AD సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం గవర్నమెంట్ కూడా మారడంతో…ఈ చిత్రం టికెట్ రేట్లు కూడా పెరిగేలా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా జూన్ 27న విడుదల అయ్యి రికార్డులు క్రియేట్ చేస్తుంది అని అందరూ ఆశిస్తున్నారు.

500 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాకి బాహుబలి రికార్డ్ అని సైతం పగలకొట్టే సత్తా ఉంది అని.. తెగ ఆనంద పడుతున్నారు ప్రభాస్ అభిమానులు. ముఖ్యంగా నిన్న వచ్చిన ట్రైలర్ కల్కి సినిమాకి.. నిజంగానే రికార్డులు బద్దలు కొట్టే సత్తా ఉందని చెప్పకనే చెప్పింది.. ఈ నేపథ్యంలో ఈ ట్రైలర్ గురించి ఒక వార్త మాత్రం ప్రభాస్ అభిమానులను కొద్దిగా నిరాశకు గురిచేస్తోంది.

https://studio.youtube.com/video/9dPtEtZ0unI/edit

Fastest 1M Likes Telugu Trailer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సంవత్సరం.. మహేష్ బాబు గుంటూరు కారం వచ్చిన ఆల్ మోస్ట్ 6 నెలల తర్వాత ఇప్పుడు ఒక బడా స్టార్ హీరో సినిమా వస్తుంది. ప్రభాస్ నటించిన కల్కి2898AD మూవీ ఈ నెల చివరిలో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది. కాగా టాలీవుడ్ లో టాప్ స్టార్స్ నటించిన సినిమాల ట్రైలర్ లు రిలీజ్ అయితే ఆ ట్రైలర్స్ సాధించే రికార్డులలో.. ముందుగా అభిమానులందరూ ఎదురుచూసేది..ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్. ఈ లక్ష లైక్స్ ను ఎంత త్వరగా తమ హీరో సినిమా ట్రైలర్ అందుకుంది.. అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు అభిమానులు.

కాగా లేటెస్ట్ గా వచ్చిన  కల్కి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత.. ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ను అందుకుంటుంది అనుకున్నా.. టాప్ 4 ప్లేస్ తో సరిపెట్టుకుంది. దీంతో ప్రభాస్ అభిమానులు కాస్త ఈ వార్త విని ఫీలవుతున్నారు. ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ కి ట్రైలర్ ప్రీమియర్స్ లైక్స్ తో కలిప.. 7 నిమిషాల టైంకి 1 లక్ష లైక్స్ మార్క్ ని అందుకుంది.

కాగా ప్రభాస్ నటించిన సలార్ సినిమా మూడు నిమిషాల్లో ఈ రికార్డు అందుకొని మొదటి ప్లేస్ లో ఉంది. ఆ తరువాత నాలుగు నిమిషాల్లో ఈ రికార్డు అందుకున్న సినిమాగా భీమ్లా నాయక్ ఉండగా.. మూడో ప్లేస్ లో వకీల్ సాబ్.. ఇప్పుడు నాలుగో ప్లేస్ లో కి కల్కి2898AD వచ్చి చేరింది. అయితే మొదటి ప్లేస్ లో కూడా ప్రభాస్ సినిమానే ఉండటం గమనర్హం. కాగా ఈ ఒక్క రికార్డ్ పోతే పోయింది.. మిగతా రికార్డ్లు అన్నీ కల్కి సినిమా పేరు పైనే ఉంటాయి.‌ అని నమ్మకంతో ఉన్నారు ప్రభాస్ అభిమానులు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu