HomeTelugu Trending'డెవిల్‌'గా కళ్యాణ్‌ రామ్‌ ఫస్ట్‌లుక్‌

‘డెవిల్‌’గా కళ్యాణ్‌ రామ్‌ ఫస్ట్‌లుక్‌

Kalyan ram movie title Devi

టాలీవుడ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌ రామ్‌, కొత్త దర్శకుడు నవీన్‌ మేడారం ఓ చిత్రం తెరకెక్కుతుంది. నేడు కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సర్‌ప్రైజ్‌ అందించారు దర్శకనిర్మాతలు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. చారిత్రక నేపథ్యంలో సాగే ఈ కథకి ‘డెవిల్‌’ అనే పేరు ఫిక్స్‌ చేశారు. ‘ది బ్రిటిష్ సీక్రెట్‌ ఏజెంట్‌’ అనే ఉపశీర్షిక. లుక్‌ విషయానికొస్తే.. పోరాట సన్నివేశానికి సంబంధించిన పోస్టర్‌ ఇది. ప్రయాణిస్తున్న రైలు నుంచి బయటకి వచ్చి ఎవరి మీదో తుపాకి గురి పెట్టి సీరియస్‌గా కనిపించారు కల్యాణ్‌ రామ్‌. ఇదే రైలుపై మన జాతీయ పతాకాన్ని పట్టుకుని కొందరు దర్శమిస్తారు.

పొడవాటి జుత్తు, గెడ్డంతో.. పంచె, బ్లేజర్‌ ధరించి మొత్తంగా బ్రిటీష్‌ కాలం నాటి పరిస్థితుల్ని కళ్లకి కట్టినట్టు చూపించారు కళ్యాణ్‌ రామ్‌. 1945 నాటి కాలానికి సంబంధించిన కొన్ని పరిణామాల్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ సినిమాకి శ్రీకాంత్‌ విస్సా కథ అందిస్తున్నారు. హర్ష వర్థన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నారు. అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కల్యాణ్‌ రామ్‌కి హీరోగా ఇది 21వ చిత్రం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu