HomeTelugu Trendingఅమిగోస్: కల్యాణ్‌ రామ్‌ లుక్‌ విడుదల

అమిగోస్: కల్యాణ్‌ రామ్‌ లుక్‌ విడుదల

kalyanram as a Software Man

నందమూరి కల్యాణ్ రామ్ ఇటీవలే ‘బింబిసార’ మూవీతో హిట్ అందుకున్నాడు. ఆ తరువాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘అమిగోస్’ చేస్తున్నారు. మైత్రీ వారు నిర్మించిన ఈ సినిమాకి రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాలో మంజునాథ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కల్యాణ్ రామ్ కనిపించనున్నట్టు చెబుతూ అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. కల్యాణ్ రామ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లుక్‌ నెటిజన్లు ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. గిబ్రాన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. త్వరలో టీజర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

20230103fr63b3d4cf50a90

Recent Articles English

Gallery

Recent Articles Telugu