HomeTelugu Big Stories'ఇండియన్‌-2' నుంచి కమల్‌ హాసన్‌ లుక్‌

‘ఇండియన్‌-2’ నుంచి కమల్‌ హాసన్‌ లుక్‌

kamal haasan look from indi

యూనివర్సల్ నటుడు కమల్‌ హాసన్‌ నటిస్తున్న భారీ బడ్జెట్‌ మూవీ ‘ఇండియన్‌-2’. ఇరవై ఏడేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా తొలి భాగం బాక్సాఫీస్‌ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పట్లో ఈ సినిమా నిర్మాతల పాలిట కామధేనువులా కాసుల వర్షం కురిపించింది. శంకర్‌ డైరెక్షన్‌, కమల్‌ నటన అప్పట్లో ఓ సంచలనం. కాగా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుంది. ఎన్నో అంతరాయాల తర్వాత గతేడాది సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్‌ పునఃప్రారంభమైంది. అప్పటి నుండి షూటింగ్‌ రెగ్యూలర్‌గా జరుగుతుంది. దాదాపు చివరి దశకు చెరుకుంది.

ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేకర్స్‌ ఈ సినిమా నుంచి కమల్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఖాకీ చొక్కా వేసుకుని నిల్చున్న కమల్‌ లుక్‌ అదిరిపోయింది. ఇండియన్‌ సినిమా హిస్టరీలోనే నెవర్‌ బిఫోర్‌ అనే రేంజ్‌లో ఫైట్స్‌ డిజైన్‌ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. రెడ్‌ జియాంట్‌, లైకా ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu