HomeTelugu Big Storiesకె.విశ్వనాథ్‌ను కలిసిన కమల్‌ హాసన్‌

కె.విశ్వనాథ్‌ను కలిసిన కమల్‌ హాసన్‌

Kamal haasan meet director
విశ్వ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 పై మరింత ఫోకస్ పెట్టాడు. శంకర్ దర్శకత్వంలో తెరపైకి రానున్న ఆ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఇక ఇటీవల హైదరాబాద్ వచ్చిన కమల్ హాసన్ తెలుగు ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్ని ఆయన స్వగృహంలో కలుసుకున్నారు.

కమల్ హాసన్ కు విశ్వనాథ్ అంటే ప్రత్యేకమైన గౌరవం. ఆయనతో అప్పట్లో స్వాతిముత్యం అనే సినిమా చేసి సౌత్ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశారు. అలాగే సాగర సంగమం, శుభ సంకల్పం కూడా అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. వీరి కలయికలో వచ్చిన ఆ క్లాసికల్ సినిమాలను చూస్తే ఇప్పటికి కూడా బోర్ కొట్టదు. ఇక కె.విశ్వనాథ్ వయసురీత్యా సినిమాలు తీయడం తగ్గించేశారు. ఇక ఆయన ప్రస్తుతం ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో ఎప్పటి నుంచో కమల్ హాసన్ తనకు ఇష్టమైన కె. విశ్వనాథ్ ను కలవాలని అనుకుంటున్నారు. ఇక మొత్తానికి ఇప్పుడు కలిశారు. ప్రత్యేకంగా ఆశీర్వాదం కూడా తీసుకుని వారి కుటుంబ సభ్యులను కూడా కలుసుకున్నారు. కమల్ హాసన్ విశ్వనాథ్ ను ఒక గురువు తరహాలో భావిస్తూ ఉంటారు. ఇక కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అనంతరం తదుపరి సినిమాతో కూడా అదే తారహలో సక్సెస్ అందుకోవాలి అని రెడీ అవుతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu