HomeTelugu Trendingబిగ్‌బాస్‌ హోస్ట్‌గా తప్పుకోనున్నకమల్‌ హాసన్‌!

బిగ్‌బాస్‌ హోస్ట్‌గా తప్పుకోనున్నకమల్‌ హాసన్‌!

Kamal haasan to step out frబిగ్‌బాస్‌ రియాలిటీ షోకి అన్నీ భాషల్లోని మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీ ఇప్పటికే 11 సీజన్లు పూర్తి చేసుకోగా.. తెలుగు,తమిళనాట మాత్రం నాలుగు సీజన్‌లు పూర్తి చేసుకుంది. తమిళంలో ఆరంభం నుంచి కమల్ హాసన్ నడిపిస్తున్నాడు. క‌మ‌ల్ ఇటీవ‌లే నాలుగో సీజ‌న్‌ కూడా విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. అక్కడ ఈ షో సూప‌ర్ హిట్ కావ‌డంలో ఆయ‌న పాత్ర ఎంతో కీల‌కం. తాజాగా వచ్చే సీజన్‌లకు క‌మ‌ల్‌ను బిగ్ బాస్ హోస్ట్‌గా చూడ‌లేమ‌ంటున్నారు. రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న క‌మ‌ల్ ఎన్నికల్లో పోటీ చేస్తూ పార్టీని నడిపిస్తున్నాడు. అంతే కాదు ఒప్పుకున్న సినిమాలను కూడా పూర్తి చేయాల్సి ఉంది. తన పార్టీ నిధుల కోసమే ఈ షోకి హోస్ట్ గా చేస్తున్నట్లు ఆ మధ్య ఓ ఇంటర్ వ్యూలో కమల్ వెల్లడించారు. వచ్చే సీజన్ లో కమల్ హోస్ట్ గా ఉండరని టాక్. దాంతో క‌మ‌ల్ స్థానంలో మరో హీరో శింబు రాబోతున్నట్లుగా ప్రచారం జ‌రుగుతోంది. మరి అత‌ను షోను సమర్ధవంతంగా నిర్వహించగ‌ల‌డా? లేక ఎలక్షన్స్ పూర్తవుతాయి కాబట్టి మళ్ళీ కమల్ రంగంలోకి దిగుతాడా? అన్నది తేలాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu