HomeTelugu Trending'విక్రమ్‌' సెట్‌లోకి అడుగుపెట్టిన కమల్‌

‘విక్రమ్‌’ సెట్‌లోకి అడుగుపెట్టిన కమల్‌

Kamal haasan vikram movie s

ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ కరోనా పాజిటివ్‌తో కొన్నాళ్లు ఐసోలేషన్‌లో ఉన్న ఇటీవలే సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. బుధవారం ‘విక్రమ్‌’ సినిమా షూట్‌లోకి కూడా ఎంటర్‌ అయ్యారు. లోకేశ్‌ కనగరాజ్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్ట్‌లో ఆరంభమైంది. అప్పటినుంచి పలు షెడ్యూల్స్‌ జరిగాయి.

ఇంకొన్నాళ్లు షూటింగ్‌ చేస్తే సినిమా పూర్తవుతుందన్న పరిస్థితిలో అనుకోకుండా కమల్‌ కరోనా బ్రేక్‌ తీసుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాలో కమల్‌తో పాటు విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురి కాంబినేషన్‌లో సీన్స్‌ చిత్రీకరిస్తున్నారు. ‘చిన్న బ్రేక్‌ తర్వాత స్టార్‌ (కమల్‌ని ఉద్దేశించి) షూట్‌కి వచ్చారు. ఆయన ఎంతో ఉత్సాహంగా ఉన్నారు’ అన్నారు లోకేశ్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu