HomeTelugu Big Storiesఅహింస: కమ్మగుంటాదే లిరికల్‌ సాంగ్‌ విడుదల

అహింస: కమ్మగుంటాదే లిరికల్‌ సాంగ్‌ విడుదల

Kammaguntadhey Lyrical Vide
దగ్గుబాటి అభిరామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అహింస’. తేజ డైరెక్షన్‌లో వస్తున్న ఈసినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి ‘కమ్మగుంటాదే’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. హీరో .. హీరోయిన్ ఒకరి పట్ల ఒకరు తమ ప్రేమను వెల్లడి చేసే ప్రయత్నంగా ఈ పాట వస్తుంది.

ఈ పాటకు ఆర్పీ పట్నాయక్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అందించారు. కాలభైరవ – కీర్తన శ్రీనివాస ఆలపించిన ఈ పాటను గ్రామీణ నేపథ్యంలోని లొకేషన్స్ లో చిత్రీకరించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాపై అంచనాలు పెంచేదిలానే ఈ పాట ఉంది. ఈ సినిమాతో గీతిక తివారి హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu