పవన్ సరసన మజ్ను భామ!

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్, పవన్ తో చేసే సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఆ సినిమా పెద్ద హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు కూడా త్రివిక్రమ్ అదే ఫార్ములా ఫాలో అయిపోతున్నాడు.
ముందుగా ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంపిక చేశారు.

ఈ ఆఫర్ తో అమ్మడు తెగ సంతోషపడిపోయింది. ఇప్పుడు మరో హీరోయిన్ కు కూడా బంపర్ ఆఫర్ వచ్చింది. నాని నటించిన మజ్ను సినిమాతో హీరోయిన్ గా పరిచయమయిన అను ఎమ్మాన్యూయల్ ను రెండో హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికీ మూడు పాటల్ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. జనవరి నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.