HomeTelugu Big Storiesపార్వతి దేవిగా ఫైర్‌ బ్రాండ్‌.. 15 ఏళ్ల తరువాత క్రేజీ కాంబో!

పార్వతి దేవిగా ఫైర్‌ బ్రాండ్‌.. 15 ఏళ్ల తరువాత క్రేజీ కాంబో!

Kangana as Parvati in Kanna

మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆయన కలల ప్రొజెక్ట్‌ ‘కన్నప్ప’. పరమేశ్వరుడిని పరమ భక్తుడైన భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా కన్నప్ప తెరకెక్కుతుంది. మంచు విష్ణు ఈ సినిమాలో కన్నప్పగా నటిస్తుండగా.. మోహన్ బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు

తాజాగా ఈమూవీకి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో శివుడు గా పాన్‌ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పార్వతి మాత పాత్ర కోసం నయనతారను సంప్రదించారు. కానీ ఆమె ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. దీంతో ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ను ఎంపిక చేసిన్నట్లు తెలుస్తుంది. ఈ వార్తపై మూవీ యూనిట్ నుంచి అధికార ప్రకటన కూడా రావాల్సి ఉంది.

Kangana 1

గతంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘ఏక్ నిరంజన్’ సినిమాలో కంగనా హీరోయిన్‌గా నటించింది. ఇపుడు చాలా 15 ఏళ్ల తర్వాత మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్‌ రిపీట్‌ కాబోతుంది. అలాగే కన్నప్ప మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలు కూడా తర్వలోనే బయటకి రానున్నాయని అంటున్నారు. AVA ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ లు పాన్ ఇండియా లెవల్లో అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాయి.

ఈ ఏడాది చివర్లో కన్నప్ప ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కన్నప్ప లో ప్రీతి ముకుందన్,మోహన్ లాల్ శివరాజ్ కుమార్, రాధికా, బ్రహ్మానందం, శరత్ కుమార్ లాంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu