HomeTelugu Trending'కాంతార 2' షూటింగ్‌ అప్డేట్‌

‘కాంతార 2’ షూటింగ్‌ అప్డేట్‌

kantara prequel movie shoot
చిన్న సినిమాగా మొదలై.. పాన్ ఇండియా మూవీగా మారి రికార్డులు సృష్టించిన చిత్రం కాంతార. ముందు కన్నడలో హిట్ టాక్ అందుకుని.. తర్వాత పలు భాషల్లో రిలీజై కోట్లు కొల్లగొట్టింది. తాజాగా ‘కాంతార 2’ కోసం పనులు మొదలయ్యాయట. డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ లో బిజీ అయిపోయారట. ఈ విషయాన్ని ‘హంబాలే ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ కిర్గందూర్ వెల్లడించారు. ఓ వార్త సంస్థతో మాట్లాడిన ఆయన పలు విషయాలను బయటపెట్టారు.

కాంతార 2 సీక్వెల్ కాదని.. ప్రీక్వెల్ అని కొత్త విషయం చెప్పారు. అలానే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. సినిమా షూటింగ్ కు వానాకాలం ముఖ్యమని, అందుకే జూన్ లో షూటింగ్ మొదలుపెడుతామని వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని విజయ్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం కర్ణాటకలోని కోస్టల్ రీజియన్ లో రిషబ్ శెట్టి పర్యటిస్తున్నారని, రెండు నెలలపాటు అక్కడే తిరుగుతూ అక్కడి సంప్రదాయాలపై మరింత సమాచారం తెలుసుకుంటారని వివరించారు. రెండో భాగానికి బడ్జెట్ పెంచామని, కానీ సినిమా స్టయిల్ అంతా తొలి భాగం మాదిరే ఉంటుందని వెల్లడించారు. నటీనటులను ఇంకా ఎంపిక చేయాల్సి ఉందని విజయ్ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu