HomeTelugu Trending'పుష్ప' సినిమా బాయ్‌కాట్‌ చేస్తామంటూ కన్నడిగుల వార్నింగ్‌

‘పుష్ప’ సినిమా బాయ్‌కాట్‌ చేస్తామంటూ కన్నడిగుల వార్నింగ్‌

karnataka people warning to
ఐకానిక్‌ స్టార్‌ అల‍్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్‌ 17న ఏడు భాషల్లో పాన్‌ ఇండియాగా రిలీజ్‌ అవుతున్న ‘పుష్ప’ గురించి సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరెక్కనున్న ‘పుష్ప’ సినిమాలో బన్నీ పుష్పరాజ్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్నా పల్లెటూరి యువతి పాత్రలో అలరించనుంది. స్టార్‌ హీరోయిన్‌ సమంత ఐటమ్‌ సాంగ్‌లో మెరవనుంది. ఈ మధ్యే విడుదలైన ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది.

ఈ నేపథ్యంలో #BoycottPushpainKarnataka ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉండటం పుష్ప మేకర్స్ ను, అభిమానులను టెన్షన్ లో పెట్టే విషయం. అల్లు అర్జున్‌ నటించిన ఈ పాన్‌ ఇండియా మూవీపై కర్ణాటక ప్రజలు ఫైర్‌ అవుతున్నారు. కర్ణాటకలో కన్నడ కంటే తెలుగు వెర్షన్‌కే ఎక్కువ స్క్రీన్స్‌ కేటాయించారని మండిపడుతున్నారు. కర్ణాటకలో సినిమా విడుదల చేయాలనుకుంటే కన్నడలోనే రిలీజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే సినిమాను బాయ్‌కాట్‌ చేస్తామని హెచ్చరిస్తున్నారు.

పుష్ప'రాజ్ కు మరో టెన్షన్… బ్యాన్ అంటూ కన్నడిగుల కన్నెర్ర

Recent Articles English

Gallery

Recent Articles Telugu