
ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. ‘కాసు మహేష్ రెడ్డి’. ప్రస్తుతం ప్రజల్లో కాసు మహేష్ రెడ్డి పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. కాసు మహేష్ రెడ్డి ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేట లో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం మహేష్ రెడ్డి గుంటూరు ఏసీ లా కళాశాలలో ఎల్.ఎల్.బి పూర్తి చేశారు. కాసు మహేష్ రెడ్డి రాజకీయాల్లో రాకముందు వ్యాపారవేత్తగా రాణించారు. పల్నాడు ప్రాంతంలో విద్యాసంస్థలు మరియు పలు వ్యాపారాలు నిర్వహించారు. మహేష్ రెడ్డి కుటుంబ నేపథ్యం లోకి వెళ్తే.. మహేష్ రెడ్డి పెద్ద తాత కాసు వెంకట రెడ్డి ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీ లోనే ఎమ్మెల్యేగా పనిచేశారు. మహేష్ రెడ్డి తాత గారు కాసు వెంగళ్ రెడ్డి పల్నాడు ప్రాంత రాజకీయాలు శాసించిన నాయకుడు.
ఇక మహేష్ రెడ్డి చిన తాత కాసు బ్రహ్మానందరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుడు మరియు మాజీ ముఖ్యమంత్రి కూడా. తండ్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మాజీ మంత్రి. తాతల కాలం నాటి నుంచి తన కుటుంబం రాజకీయాల్లో ఉండటం వలన మహేష్ రెడ్డి సైతం రాజకీయాల్లో అడుగుపెట్టి తన మిత్రుడైన జగన్ సమక్షంలో వైసీపీ లో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్ధిగా గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
మరి, రాజకీయ నాయకుడిగా కాసు మహేష్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో కాసు మహేష్ రెడ్డి పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో కాసు మహేష్ రెడ్డి పరిస్థితేంటి ?, మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ కాసు మహేష్ రెడ్డికి ఉందా ?, చూద్దాం రండి. కాసు మహేష్ రెడ్డి పై వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పల్నాడు ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం తపించిన తన తాతలకు మరియు తన తండ్రికి భిన్నంగా మహేష్ రెడ్డి కేవలం వాణిజ్య ధోరణితోనే తన రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్నారు. పల్నాడు ప్రజల్లో కూడా కాసు మహేష్ రెడ్డి పై ఇదే అభిప్రాయం ఉంది.
ఐతే, తన పై ఉన్న ఈ గుసగుసలను కాసు మహేష్ రెడ్డి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. రాజకీయంగా వివాదరహితుడిగా తన ఇమేజ్ ను కాపాడుకుంటూ వస్తున్నప్పటికీ… అవినీతి విషయంలో మాత్రం కాసు మహేష్ రెడ్డి విచ్చలవిడిగా ముందుకు వెళ్తున్నారు. మొత్తంగా తనను గెలిపించిన ప్రజలకు కాసు మహేష్ రెడ్డి తనేం చేయలేకపోయాడు. కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో కాసు మహేష్ రెడ్డి ఎట్టిపరిస్థితిలో గెలవడు.











