HomeTelugu News'కేదార్‌నాథ్‌' బ్యాన్‌ చేయాలి

‘కేదార్‌నాథ్‌’ బ్యాన్‌ చేయాలి

బాలీవుడ్‌ నటులు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, సారా అలీ ఖాన్‌ హీరో,హీరోయిన్లుగా నటించిన సినిమా ‘కేదార్‌నాథ్‌’. అభిషేక్‌ కపూర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా..ఈ సినిమాను నిషేధించాలంటూ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ఆలయ అర్చకులు ఆందోళనలు చేస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అర్చకులు. 2013లో కేదార్‌నాథ్‌లో వచ్చిన వరదల నేపథ్యంలో ఓ యువతి, యువకుడి మధ్య పుట్టిన ప్రేమ కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించారు.

8 2

ఇటీవల ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది. దాంతో అర్చకులు సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘సినిమాను నిషేధించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం. సినిమా టీజర్‌ చూసినవారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమా లవ్‌ జిహాద్‌ని ప్రేరేపించేలా ఉందని, తమ మనోభావాలు దెబ్బతినేలా టీజర్‌ ఉందని అంటున్నారు. పోస్టర్‌లో ముస్లిం యువకుడు, హిందూ యువతిని మోసుకెళుతున్నట్లు చూపించారు. అసలు కేదార్‌నాథ్‌కు ముస్లింలే రారు. అదీకాకుండా సినిమా టీజర్‌లో..వరదల్లో వేలాది మంది కొట్టుకుపోతూ చనిపోతుంటే ఆ దృశ్యాల మధ్య ముద్దు సన్నివేశాలను చూపించారు. కాబట్టి ‘కేదార్‌నాథ్‌’ సినిమాను బ్యాన్‌ చేయండి.’ అని ఆలయ అర్చకులకు చెందిన కేదార్‌ సభ ఛైర్మన్‌ వినోద్‌ శుక్ల మీడియా ద్వారా వెల్లడించారు. ఈ విషయమై చిత్రబృందం స్పందించాల్సి ఉంది. కాగా ఈ సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu