HomeTelugu Big Storiesచిరుకి చెల్లిగా కీర్తి సురేష్‌..

చిరుకి చెల్లిగా కీర్తి సురేష్‌..

keerthi suresh sister as me

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్ట్‌ 22) సంద‌ర్భంగా ఆయ‌న సినిమాలకు సంబంధించి వ‌రుస అప్‌డేట్స్ వస్తున్నాయి. శనివారం నాడు మెగాస్టార్‌ హీరోగా మోహన్ రాజా తెర‌కెక్కిస్తున్న లూసిఫ‌ర్ రీమేక్ టైటిల్ రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే. గాడ్‌ ఫాద‌ర్ అనే టైటిల్ చిత్రానికి ఫిక్స్ చేసిన‌ట్టు పోస్ట‌ర్ ద్వారా రివీల్ చేశారు. ఇక ఆదివారం ఉదయం మెహ‌ర్ ర‌మేశ్‌మూవీకి సంబంధించిన టైటిల్‌ని మ‌హేశ్‌ బాబు చేతుల మీదుగా వదిలారు. చిరంజీవి నటిస్తున్న 154 వ చిత్రం ఇది. ఈ చిత్రానికి ‘భోళా శంకర్‌’ అని టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ మూవీ టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తాజాగా ఈ మూవీ నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్‌తో అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది చిత్ర యూనిట్‌. రాఖీ పండగ సందర్భంగా ఈ చిత్రంలో చిరంజీవికి సోదరిగా నటించబోతున్న హీరోయిన్‌ని ప్రకటిస్తూ అదరిపోయే వీడియోను రిలీజ్‌ చేశారు. అందరూ ఊహించినట్లుగానే ఇందులో మెగాస్టార్‌కి చెల్లిగా స్టార్‌ హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ నటించబోతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu