బోయపాటి కోసం బాలయ్య కష్టం

నందమూరి బాలకృష్ణ .. కెఎస్ రవికుమార్ కాంబినేషన్లో ‘105’ వ సినిమా షూటింగ్ జరుగుతున్నది. ఈ మూవీలో బాలయ్య కొత్తగా కనిపిస్తున్నారు. కొత్త మేకోవర్ తో ఆకట్టుకునే విధంగాఉన్నాడు. బాలయ్యను ఎప్పుడు చూడని విధంగా కొత్తగా చూడటంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇక ఇదిలా ఉంటె, ఈ మూవీ తరువాత బాలయ్య బోయపాటితో సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతున్నది. బాలకృష్ణ.. బోయపాటి కాంబినేషన్లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. రెండు మంచి హిట్ సాధించాయి. ఇది మూడో సినిమా. ఈ సినిమాలో బాలయ్యను పవర్ ఫుల్ గా చూపించబోతున్నారు. దీనికోసం బాలయ్య షేపులను మార్చేస్తున్నారు బోయపాటి. ఇప్పుడున్న బరువుకు దాదాపుగా 25 కేజీల బరువు తగ్గాల్సి ఉందట. అందుకోసమే డైలీ జిమ్ లో 5 గంటలు వర్కౌట్ చేస్తున్నారు. వెయిట్ మెయింటైన్ చేసేందుకు తగిన డైట్ ను తీసుకుంటున్నారట. బాలయ్యను చాలా కొత్తగా చూపించేందుకు బోయపాటి ట్రై చేస్తున్నారు.