HomeTelugu Newsబాలయ్య సినిమాకు డేట్స్ లేవన్న కీర్తి..!

బాలయ్య సినిమాకు డేట్స్ లేవన్న కీర్తి..!

13 16
లెజెండ్ బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు హీరోయిన్‌ ఎంపికపై మొదట్నుంచి సమస్య వెంటాడుతూనే ఉంది. తొలుత కేథరిన్ ట్రెసాను ఈ సినిమాకు హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఆమె భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో ఆమెను తప్పించారని చెబుతున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఒక హీరోయిన్‌గా శ్రియ నటిస్తోంది. మరో హీరోయిన్ కోసం అన్వేషణ కొనసాగుతోంది. `మహానటి`తో
తెలుగువారికి దగ్గరైన కీర్తి సురేష్‌ను సంప్రదిస్తే డేట్స్ లేవంటూ సున్నితంగా తిరస్కరించిందట. కీర్తి ప్రస్తుతం మిస్ ఇండియా’లో నటిస్తోంది. చివరకు అంజలిని ఫైనల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో డిక్టేటర్‌ అనే చిత్రంలో బాలయ్యతో నటించిన సంగతి తెలిసిందే. బాలయ్య సరసన అంజలి మరోసారి అలరించబోతుందన్నమాట. ఇక ఈ చిత్రంలో బాలయ్య రెండు డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌లో కనిపించబోతున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu