HomeTelugu Trending'కేజీఎఫ్ : చాప్టర్ 2' ట్రైలర్ వచ్చేస్తుంది

‘కేజీఎఫ్ : చాప్టర్ 2’ ట్రైలర్ వచ్చేస్తుంది

kgf 2 movie trailer release 1
శాండల్‌వుడ్ హీరో యష్ నటించిన చిత్రం ‘కేజీఎఫ్’ చాప్టర్ 2. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా కోసం యష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అయితే తాజాగా ‘కేజీఎఫ్ : చాప్టర్ 2’ ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఇప్పటి నుంచే ట్రైలర్ గురించి ఎదురు చూపులు మొదలయ్యాయి.

ఈరోజు ఈ యాక్షన్ డ్రామా ట్రైలర్ విడుదలకు సంబంధించిన డేట్ ను రివీల్ చేస్తూ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మార్చి 27న సాయంత్రం 06:40 గంటలకు ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. హోంబలే పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించిన ‘కేజీఎఫ్ : చాప్టర్ 2’ లో శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్, ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. విజయవంతమైన సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ బహుభాషా చిత్రానికి సంగీతం అందించారు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu